గురుదేవుడు(ఇష్టపది మాలిక)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య

గురుదేవుడు(ఇష్టపది మాలిక)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య

తమసు మునిగిన ధరను తరలింప వెలుగు దరి
అంతరించెడి విలువ లమృతత్వము నింప

జ్ఞానమే రూపమై నవ్య సందీపమై
దివినుండి పుడమిపై దిగివచ్చె గురువుయై

అలక్ష్యంధరుడిలో ఆవరించియు ధరణి
నలవోకగా గెలిచె నరిష్టాటిలు గురువు

రామున్ని సుగుణాల ధామున్ని గా దిద్ది
వసుధకందించినా వశిష్ఠుండూ గురువు

చంద్రగుప్తునిచేత శపథమీడేర్చుకొని
శత్రునాశము చేసె చాణక్యుండు గురువు

వేదమతడే, జగతి నాదమతడే, శాస్త్ర
వాదమతడే! శిష్య మోదమతడే! సతము

రమేశుడే గురువు,పరమేశుడే గురువు
వాణీశుడే గురువు వసుమతీశుడె గురువు

తరువులా నీడిచ్చి, చెరువులా నీరిచ్చి
కరువు బాపెడి గురువ! మరుమల్లె వందనం!!


(అలక్ష్యంధరుడు=అలెగ్జాండర్ 
తమసు =అంధకారం)

కవిచక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125

0/Post a Comment/Comments