ఆచార్య దేవోభవ
గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మం..
తస్మయ్ శ్రీ గురువే నమః ...
చిటపట చినుకల ఆషాఢ మాసాన...
ఆనంద హేలపౌర్ణమి నాటి శశాంకుడి
లో నాకు నా గురువు కనిపిస్తాడు....
నాకు గురుపౌర్ణమి ఇష్టమైన జ పండుగ..
తన బోధనలతో మనిషి లోని
అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్నిచ్చేవాడు గురువు.
మహా కవి వ్యాసుడు జన్మదిన
తిథి వ్యాసపూర్ణిమ గురుపూర్ణిమ.
గురువులను పూజించే ఆచారం
హైందవ సంస్కృతి కి మూలము
ఆషాఢ పూర్ణిమ రోజున తమగురువులకు
గురుపూజామహోత్సవాన్ని
కన్నుల పండుగగా జరుపుకుంటారు...
భారతీయ సంస్కృతికి మూల
పురుషుడైన వ్యాసుడు
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తో
సమాన వ్యక్తి....ఆ మహానుభావుని జన్మదినం
ఎందరో గురువులకు పుణ్య దినం.....
శంకరాచార్య,రామానుజాచార్యులు,
దత్తా త్రేయ స్వామి..సమర్థసాయి ...
ఎందరో మహానుభావులు
జాతికి కల్పవృక్షాలు..
గురువులన్నందరికిఅందరికి
గురుపూర్ణిమ అక్షర నీరాజనాలు .....
శ్రీమతి సత్య మొం డ్రెటి
హైదరాబాద్
9590239581
ప్రక్రియ,:వచనము