మాదక ద్రవ్యాలు - యువతపై దుస్ప్రభావం..
హాయి గొలుపును మాదకద్రవ్యం
చిన్నా భిన్నం చేయును బ్రతుకును
యువతకు ఇదొక విలాస జీవకారిణి.
ప్రాణాలు హరించే ఒక మహమ్మారి
మాదకద్రవ్యం.
సమాజానికి ప్రమాదమే మాదక ద్రవ్యానికి
వ్యసనమైన వ్యక్తులతో...
కుటుంబం దుర్భలమే వ్యసనపరులతో....
యువతరాన్ని దారిమళ్ళించి చెడు మార్గాన్ని చూపించే
దురాలవాటు మాదకద్రవ్యం.
మాదకద్రవ్యానికి బానిసై బ్రతుకు ఒక అంధకారంగా మార్చుకుని
జీవితం దుర్బలమై నిర్భాగ్యులుగా మిగిలి..
ఉత్సహంగా ఉరకలు వేయవలసిన వయసులో
జవసత్వాలుసన్నగిల్లి శారీరకంగా మానసికంగా నిర్వీర్యమై..
శరీర అంతర్భాగాలు క్షీణించి
జీవచ్ఛవాలుగా బ్రతుకుతూ
చదువులు దూరమైసంస్కారం అడుగంటి
ఆరోగ్యం నిర్వీర్యమై
అజ్ఞానంలో బ్రతుకు బాటతో
జీవితాన్ని ఎటు ఈదలేక వ్యసనపరులై
సమాజానికి చీడ పురుగులపట్టిపీడించే
ఒక కర్కషమానవ శత్రువులనిరూపయోగిగా
కుటుంబానికి నిర్భాగ్యులుగా
నీతి న్యాయం తెలియని పక్షవాత రోతలామిగిలెను నేటి యువత
మాదక ద్రవ్యాల వలలో చిక్కుకుని.
--- వి. కృష్ణవేణి
వాడపాలెం
తూర్పుగోదావరి జిల్లా
ప్రక్రియ :వచనం