సీస పద్యము
సత్యాగ్రహమె కదా సాధించె గాంధిచే
శ్వేత జాతి దరిమి స్వేచ్ఛ మనకు
సత్య నిష్ఠయె కదా చల్లార్చె గోవుచే
శార్థూల కర్కశ శకల వేడి
సత్య సంధతె కదా స్థాపించెనొకరాజు
దన పేరె తిరముగా తనరునట్లు
సత్య లోకమె కదా సకల విద్యల ఘని
వాగ్దేవి యబ్జభవు వాస తలము
ఆ.వె.
సత్యమేవ జయతె సర్వ యుద్ధములందు
వేదమందు మరియు వాదమందు
సకల శాస్త్రములను సత్యమే నిత్యమై
మిగులు దైవమల్లె మెరియుచిలను
కవిచక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125