"మట్టిలోమాణిక్యం - వరకవి సిద్దప్ప" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"మట్టిలోమాణిక్యం - వరకవి సిద్దప్ప" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

మట్టిలోమాణిక్యం - వరకవి సిద్దప్ప

వాగ్దేవి కరుణతో వరంపొంది
వరకవిగా ఖ్యాతిచెంది
లోకసారాన్ని ఆపోశనపట్టి
సంప్రదాయభావాలను బద్దలుకొట్టి
రమణీయమైన తెలుగుపదాలను
ఆకర్షణీయంగా తన తత్వాలలో
పొదిగిన సాహితీశిల్పి సిద్దప్ప

మట్టిలోమాణిక్యమైవెలిగిన తెలుగుబిడ్డ
శ్రమజీవుల ముద్దుబిడ్డ
జనపదాలతోఆడుకునే ఆశుకవి
అనుభవజ్ఞానంతో అపారసంపదను
ప్రజలకందించిన వరకవి

ఆర్తి, ఆవేదన, సంఘంపట్లకసి
అసమానతలపై అసహ్యంతో
భార్యగావలె నాకు ప్రాణకాంతానంటూ
కులవాదాన్నినిరసించి
సంఘసంస్కరణాభిలాషే ఊపిరిగా
ధిక్కారస్వరమే ప్రాణంగా
ప్రజాసౌఖ్యమే పరమావధిగా జీవించి
సమస్తకులాలకు విరాటస్వరూపియై
దర్శనమిచ్చే మట్టిమనిషిసిద్దప్ప

మట్టిఒకటే కుండలువేరు
బంగారమొక్కటే సొమ్ములువేరుఅనే
విలువైన తత్వాలను బోధించి
తెలుగుహృదయాలలో వెలిగిన
ఆణిముత్యం సిద్దప్పయోగి

--- ఆచార్య ఎం రామనాథం నాయుడు,
మైసూరు.

0/Post a Comment/Comments