మనదేశం డా.రామక కృష్ణమూర్తి

మనదేశం డా.రామక కృష్ణమూర్తి

మనదేశం
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.


ఘన వారసత్వ సంపదతో
ఉన్నత సంస్కృతి బలంతో
వేదవాఙ్మయ విజ్ఞానంతో
అలరారే భారతదేశం మనదే.
సహజవనరుల సమ్మిళితము
నదీనదాల అమృతజలాలు
అన్నపూర్ణ వ్యవసాయంతో
నిలబడ్డ భరతభూమి మనదే.
గణతంత్రం,ప్రజాస్వామ్యం,
లౌకిక తత్వం,రాజ్యాంగం,
స్వేచ్ఛ,స్వాతంత్ర్యాలు 
నిరాటంకంగా నడిచే 
శాంతికాముక దేశం మనదే.
అభివృద్ధి,ఆచరణ,ఆనందం,
ఆర్షధర్మం,సాంకేతికత,
అణుపాటవం,సమృద్ధిగా
పదిలపరుస్తున్న కర్మభూమి 
దేశం మనదే.
సహనం,శాంతి పునాదులపై
పరిఢవిల్లిన దేశం ముమ్మాటికి మనదే.


0/Post a Comment/Comments