వేకువ వెలుగై బయటికి రా!!--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

వేకువ వెలుగై బయటికి రా!!--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

వేకువ వెలుగై బయటికి రా!!
----------------------------------
నైరాశ్యపు అమావాస్యను చీల్చి
నిండు పౌర్ణమి చందురుడువై ఉదయించు
మానసిక ఒత్తిడి బురద గుంటల్లోంచి
పంకజమై పరిమళించు
మోడుబారిన  ఆశల  మొ(పొ)దల్లోంచి
  లేలేత చిగుళ్లవై చిగురించు
జీవితాకాశంలో మనోధైర్యం   
 రవికిరణమై ప్రకాశించు
మిత్రమా ! ఎందాక 
కన్నీటి కొమ్మపై  ఒంటరి పాక్షివై
విలపిస్తావ్!
రా! బయటికి రా!!
అలముకొన్న ఆవేదనల మేఘాల్లోంచి 
వేకువ వెలుగై నలుదిక్కులా
గుండెపై కొండంత బాధల  
 బరువును దించుకొని
దూది పింజమై, కాంతి పుంజమై
రా! వెలుపలికి రా! సింగమై
--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments