చిట్టి పొట్టి చిట్టెమ్మ (కవిత) బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి

చిట్టి పొట్టి చిట్టెమ్మ (కవిత) బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి

🤹‍♂️చిట్టి పొట్టి చిట్టెమ్మ🤹‍♂️

ఓచిట్టి పొట్టి మాచిట్టెమ్మ
పలక బలపం నీవుపట్టమ్మ
లక్షణంగా పోవాలి బడి కమ్మ
అక్షరాలు నేర్పించే గుడి కమ్మ !

ఓచిట్టి పొట్టి మా చిట్టెమ్మ
పెన్సిల్ రబ్బరు పట్టమ్మ
బొమ్మలు బాగా వేయమ్మ
కమ్మలు చింపక నీవమ్మ !

ఓచిట్టి పొట్టి మా చిట్టమ్మ
తెలుగు వాచకం పట్టమ్మ
గలగల నీవు చదువమ్మ
సిరి గల మా ముద్దుల కొమ్మ !

ఓ చిట్టి పొట్టి మా చిట్టెమ్మ
ఎక్కాల చిట్టాను పట్టమ్మ
ఎక్కాలు బాగాచదవాలమ్మ
లెక్కల్లో వేగా ఎదగాలమ్మ !

ఓ చిట్టి పొట్టి మా చిట్టమ్మ
టెక్స్ట్ బుక్కులు పట్టమ్మ
టెస్టులు బాగా రాయాలమ్మ
మార్కులు వేగా తేవాలమ్మ !

ఓ చిట్టి పుట్టి మా చిట్టెమ్మ
చిట్టిపొట్టి కథలను చెప్పమ్మ
గురువులందరూ మెచ్చేస్తారు
బహుమతులెన్నో ఇచ్చేస్తారు!

ఓ చిట్టి పొట్టి మా చిట్టెమ్మ
 పొడుపు కథలను చెప్పమ్మ
 ఆఆటవిడుపు లో  నీవమ్మ
వాటి గుట్టును నీవు విప్పమ్మ !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్, 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments