ఏం లోకం ఇది..! ---ముహమ్మద్ ముస్త ఖీమ్ - విన్నర్

ఏం లోకం ఇది..! ---ముహమ్మద్ ముస్త ఖీమ్ - విన్నర్

ఏం లోకం ఇది..!


మంచోల్లు తక్కువగా నున్న
లోకము ఇది..!
ముంచడం నేర్చుకున్న 
మహానుభావుల కాలము ఇది..!

రకరకాల పేర్లతో డబ్బులు దోచుకునే 
దొంగల లోకము ఇది..!
ప్రలోభాలకు కొదవ ఉండదు,
ప్రలోభాల కాలము ఇది..!

మంచిని భూతద్దంలో వెతకాలి, 
బాగా కనిపిస్తే ఒట్టు,
చెడు నిండా నింపుకున్న 
పుడమి ఉన్న లోకము ఇది..!

మోసం..నిత్య 
నూతనం ఇక్కడ..!
మోస పోతున్న అమాయకులు
అధికం ఇక్కడ..!

మోసగాళ్ళు, దగా కోరులు.స్వార్థపరులు..
ఇత్యాది బద్మాషులు నిల్చున్న లోకము ఇది..!
తస్మాత్ జాగ్రత్త గా ఉంటూ,తీవ్రంగా.. 
శంకించాల్సిన..కాలము ఇదీ..!?  

విన్నర్,
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments