చిరుజల్లులకై చిరు ప్రార్థన !
మానసిక వైద్యుల
భౌతిక శాస్త్రవేత్తల
పర్యావరణ పరిరక్షకుల
ఆర్థికశాస్త్రంలో ఆరితేరిన
ఖగోళశాస్త్రంలో కాకలు తీరిన
తర్కశాస్త్రంలో తలలు పండిన
ఆథ్యాత్మిక గురువుల అందరి
"ఆఖరి ఆకలి"...సందేశమొక్కటే!
ధైవమెక్కడో ....ధైర్యమక్కడని!
ధైర్యమెక్కడో ...దారి అక్కడని!
దారి ఎక్కడో ... ఊరు అక్కడని!
ఊరు ఎక్కడో ..అన్నదాతలక్కడని!
అన్నదాతలెక్కడో...ఎండినపొలాలక్కడని!
ఎండిన పొలాలెక్కడో...పండని పంటక్కడని
పండని పంటలెక్కడో...నల్లమబ్బులకోసం
అన్నదాతల ఎదురుచూపులక్కడని!
నల్లమబ్బులెక్కడో...చల్లనిగాలిఅక్కడని!
చల్లనిగాలిఎక్కడో...ఉరిమే ఉరుములక్కడని!
ఉరిమే ఉరుములెక్కడో...మెరిసే మెరుపులక్కడని!
మెరిసే మెరుపులెక్కడో...కురిసే మేఘాలక్కడని!
కురిసే మేఘాలెక్కడో...చిటపట చినుకులక్కడని!
చిటపట చినుకులెక్కడో...చిరునవ్వులక్కడని!
చిరునవ్వులెక్కడో...చిరుదివ్వెలక్కడని!
చిరుదివ్వెలెక్కడో...వెన్నెల వెలుగులక్కడని!
వెన్నెల వెలుగులెక్కడో...చల్లని బ్రతులక్కడని!
అందుకే ఓ దైవమా!
మాపై దయచూపుమా!
దారిచూపుమా !కరుణించుమా!
చిరుజల్లులు కురిపించుమా !
మా అన్నదాతల ఆశలు తీర్చుమా!
పచ్చని పంటలినిచ్చి మా అందరి
ఆకలిమంటలు తీర్చుమా ! ఓ తండ్రీ!
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
మానసిక వైద్యుల
భౌతిక శాస్త్రవేత్తల
పర్యావరణ పరిరక్షకుల
ఆర్థికశాస్త్రంలో ఆరితేరిన
ఖగోళశాస్త్రంలో కాకలు తీరిన
తర్కశాస్త్రంలో తలలు పండిన
ఆథ్యాత్మిక గురువుల అందరి
"ఆఖరి ఆకలి"...సందేశమొక్కటే!
ధైవమెక్కడో ....ధైర్యమక్కడని!
ధైర్యమెక్కడో ...దారి అక్కడని!
దారి ఎక్కడో ... ఊరు అక్కడని!
ఊరు ఎక్కడో ..అన్నదాతలక్కడని!
అన్నదాతలెక్కడో...ఎండినపొలాలక్కడని!
ఎండిన పొలాలెక్కడో...పండని పంటక్కడని
పండని పంటలెక్కడో...నల్లమబ్బులకోసం
అన్నదాతల ఎదురుచూపులక్కడని!
నల్లమబ్బులెక్కడో...చల్లనిగాలిఅక్కడని!
చల్లనిగాలిఎక్కడో...ఉరిమే ఉరుములక్కడని!
ఉరిమే ఉరుములెక్కడో...మెరిసే మెరుపులక్కడని!
మెరిసే మెరుపులెక్కడో...కురిసే మేఘాలక్కడని!
కురిసే మేఘాలెక్కడో...చిటపట చినుకులక్కడని!
చిటపట చినుకులెక్కడో...చిరునవ్వులక్కడని!
చిరునవ్వులెక్కడో...చిరుదివ్వెలక్కడని!
చిరుదివ్వెలెక్కడో...వెన్నెల వెలుగులక్కడని!
వెన్నెల వెలుగులెక్కడో...చల్లని బ్రతులక్కడని!
అందుకే ఓ దైవమా!
మాపై దయచూపుమా!
దారిచూపుమా !కరుణించుమా!
చిరుజల్లులు కురిపించుమా !
మా అన్నదాతల ఆశలు తీర్చుమా!
పచ్చని పంటలినిచ్చి మా అందరి
ఆకలిమంటలు తీర్చుమా ! ఓ తండ్రీ!
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502