పొగాకు పొగ
పొగతాగడం ప్రాణాంతకం
పొగతాగితే పోయేకాలం
దాపురించినట్టే
అదొకదురలవాటు
వ్యసనానికి బానిస
పేదవాడి వ్యసనం బీడి, అగ్గపెట్టె
ధనవంతుని దర్పం సిగరెట్, లైటర్
పొగ కాల్చేస్తుంది దేహపుభాగాల్ని
కూల్చేస్తుంది జీవనపయనాన్ని
దాన్ని నివారించడం
పెద్ద అసమ్మతి తరంగం
పొగాకు సేవనంవల్ల
అనారోగ్యమని తెలుసు
అలవాటు మానుకోలేక
బతుకు మీద భయంలేక
భయపెట్టే నాథుడులేక
రోగాలమయంతో రోదిస్తూ
మరణశయ్యపై నరకయాతన
పడడం మనిషికి పరిపాటి
పొగతాగనివాడు
మరుజన్మలో దున్నపోతుగా
పుడతాడని చెప్పే
మూర్ఖపుమనుషులు మారాలి
సమాజంలో మార్పు అవసరం
పొగలేని బతుకుకోసం
పోరాటం అనివార్యం
ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు