షాకింగ్ & బ్రేకింగ్ న్యూస్ (New)
నిన్నటి......షాకింగ్ న్యూస్...
మనిషిని...కుక్క...కరవడం
కానీ నేటి...బ్రేకింగ్ న్యూస్...
మనిషే......కుక్కను కరవడం
నిన్నటి......షాకింగ్ న్యూస్...
కాలిలో.....ముల్లు...గుచ్చుకోవడం
కానీ నేటి...బ్రేకింగ్ న్యూస్...
కంటిలో.....గునపం...గుచ్చుకోవడం
నిన్నటి........ షాకింగ్ న్యూస్...
చెట్టు...........మొదలుకు...చీడపట్టడం
కానీ నేటి......బ్రేకింగ్ న్యూస్...
విత్తనాలకు..వేర్లకు...చీడపట్టడం
నిన్నటి........షాకింగ్ న్యూస్...
కన్నుమూసి.మనిషికట్టెగా...మారడం
కానీ నేటి.....బ్రేకింగ్ న్యూస్...
ఆ కట్టెను కాటిలో...కాల్చేందుకు...కట్టెలు
పూడ్చేందు...కింతస్థలం...దొరక్కపోవడం
నిన్నటి......షాకింగ్ న్యూస్...
చీమలు పెట్టిన పుట్టల్లో...పాములు... దూరడం
కానీ నేటి....బ్రేకింగ్ న్యూస్...
పాముల పుట్టల్లోకి...చలిచీమలదండు... చేరడం
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502