విలువలతో కూడిన విజేత..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

విలువలతో కూడిన విజేత..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

విలువలతో కూడిన విజేత..! (కవిత)
******✍🏻విన్నర్*******
అన్నీ ఓర్చుకున్నవాడు జీవితాన్ని గెలుస్తాడు..!
ఓర్పు విజయానికి, 
దగ్గరి దారై నిలుచుంది,
ప్రతి విజేతకు..! 

ఎన్ని సమస్యలు చుట్టుముట్టిన "విజేత" ఎప్పుడూ విసుగును 
దరి చేరనీయడు..!
విలువలతో కూడిన, 
"విజేత" జీవితం 
నిత్యం, 
సంతోషాలతో విలసిల్లి ఉంటుంది..!

"పట్టిందల్లా బంగారం" అన్నట్లు 
ఉంటుంది విజేత పరిస్థితి..!
ప్రతి పనినీ నిండైన ఆత్మవిశ్వాసంతో పూర్తి 
గావించి,చిరునవ్వు
చిందిస్తాడు..!

అన్ని రకాల ఉద్వేగాలను తన అదుపులో నుంచుకొని జీవితంలో ముందుకు వెళతాడు..!
"విజయ పథం" తనకు తానుగా పరిచయమై తీరుతుంది..! విజయం
 దరి చేరుతుంది..!

విజేత జీవితం,విలువలతో ఉండి,జగత్తులో ఆదర్శప్రాయంగా ఉంటుంది..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments