చిరంజీవి
ఎన్నిఎన్ని సిరులున్న
అనారోగ్యం ఉన్న
తినేది ఏది లేదన్న
ఆరోగ్యమే మహాభాగ్యమన్న
సమయపాలనతో
పోషకాహారంతో
పాలు పెరుగు ల తో
ఆరోగ్య వృద్ధి....
వీధి అంగళ్ళలో తిన కన్నా
ఇంటి పుడ్డే ఒంటికి మిన్న
రకరకాల తిళ్లు అనారోగ్య హేతువు అన్న
శీతల పానీయాలు
నూడిల్స్ పాస్తా లు నీకు సరిపడవు అన్న
పుట్టిపెరిగింది వరి అన్నమే
ఆహారపు అలవాట్లు
నిద్రా సమయాలు
అనుకూల వ్యాయామాలు
దైవ జ్ఞాన నియమాలు
అందించిన ఆరోగ్యం
మానసిక పరిపక్వత
కలిగి ఉంటావా అన్న
అదియే నీకు ఆరోగ్య రక్ష..
రాదు నీ దరికీ బిపి సుగర్
ఎనలేని ఉత్సాహమే
నీ సొంతమవుతుంది
కండర కదలికతో
క్రమ బద్ద జీవనశైలిలో
తనువు మనసు
ప్రశాంతత తోఆరోగ్య విజయుడు నీవు....
మనుషుల ఆరోగ్యమే దేశ సౌభాగ్యం.....
పేరు:శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్