'చిన్నారులు:-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు

'చిన్నారులు:-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు

' చిన్నారులు '
--------------------------------
చిన్నారుల బుగ్గలు
సన్నజాజి మొగ్గలు
ఇంటి ముందు ముగ్గులు
చంటి పాప సిగ్గులు

తొలకరి చిరు జల్లులు
పాల వంటి నవ్వులు
పసిబిడ్డల మనసులు
విరబూసిన పువ్వులు

పసి కూనల పలుకులు
వెన్నెలమ్మ కాంతులు
జుంటితేనె చినుకులు
తీయనైన ధారలు

వెలుగులీను భానులు
ముద్దులొలుకు బాలలు
రేపటి భారత పౌరులు
భారతమ్మ బిడ్డలు

చిన్నారుల తలపులు
పారిజాత పూవులు
పాలకడలి తరగలు
ప్రేమమయ వీచికలు

మింటిలోన తారలు
ఇంటిలోన బాలలు
గృహమున ఇలవేల్పులు
తిరుగులేని రాజులు

--గద్వాల సోమన్న,
గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు

0/Post a Comment/Comments