ప్రేమ పక్షులు..!(కవిత)
******✍🏻విన్నర్********
కాస్త పెద్దగా అయ్యారో లేదో..
ప్రేమ పక్షులు ,
అయిపోయారు..!?
కన్న తల్లిదండ్రులకు తీరని వ్యథనిస్తూ లేచిపో తున్నారు..!??
కనిపెంచిన మాతృత్వం..
రోదిస్తోంది..!
ఏమనాలో చెప్పలేక పితృత్వం.,మౌనంగా
విలపిస్తోంది..!
కొత్త ఈడు బుధ్ధి లేకుండా..
నవయౌవనం తెలివి లేకుండా..
సంప్రదాయ తెరలు
తెగ్గొట్టి మరీ ఫరార్ అవుతోంది..!
ప్రేమికుని మోజులో..
నిర్లజ్జగా కన్నెపిల్ల ఇల్లు వదలి..
ఎలా పారిపోతోంది..!???
ఇంటి గౌరవం,
గంగలో కలిపేసినట్లు..
కన్న ఇంటిని ఆచారాల్ని,క్రమశిక్షణను తుంగలో తొక్కినట్లు..
ఎలాంటి అపరాధము కాదన్నట్లు..
ఇష్టమైన వాడితో,
కన్నవారిని కష్ట పెడుతూ,
రిజిస్టర్ మ్యారేజ్ తో ఎలా మనువాడుతోంది..!???
ఇలాంటి దిక్కుమాలిన పనికి
కొందరు పెద్దలు వత్తాసు పలకడం..
మూర్ఖత్వం..
అవివేకం..
కన్న తల్లిదండ్రుల వైపు ఆలోచించక పోవడం..
దారుణం..
అన్యాయం..
అధర్మం..!!????
ఇంత కన్నా ఇంకేం చెప్పేది..!??
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.
9705235385.