వెచ్చని సూరీడు ...ముహమ్మద్ ముస్త ఖీమ్ "విన్నర్"

వెచ్చని సూరీడు ...ముహమ్మద్ ముస్త ఖీమ్ "విన్నర్"

వెచ్చని సూరీడు

ఆ లేలేత అందాల..
వెచ్చని సూరీడు కిరణాలు..!
ఈ వెచ్చనైన కిరణాలు.. బంగారు శోభిత ఆభరణాలు..!
తన్మయించిన ప్రకృతి రాణి లో ఎన్నెన్ని భావమ్ముల వర్ణాలు..!
ఆ తుమ్మెదల యదేచ్ఛగా విహారణలు, ఝుఃమ్మంటు నాదాలు..! తీయ తీయని కూని రాగాలు..!
ఆనంద పారవశ్యాలు..!
ఆ పక్షుల కిల కిల అరుపులు,తీయనైన కూతలు..!
పులకించిన భూమాత., 
తిలకించిన ఆ అందాల పారిజాత.,
సొగసైన కొండ మల్లె తీగల గుబాళింపులు..!
పూల మకరందములు గ్రోలు..ఆ తేనె టీగలు..!
ఆ ఎత్తయిన కొండలు-కోనలు.. సుదూ రానా..! 
ఆ రాళ్ల గుట్టలు.. ఎడా పెడానా..!
ఆ కౌజు పిట్టలు,ఆ బుర్క పిట్టలు, ఆ రంగు రంగుల సీతాకోక చిలుకలు.. పక్ష్యాదులు..సైతం
జీవితాన్ని ఎంత ఆనందమయం చేసుకుంటున్నాయో..కదా..?నని..
ప్రకృతి అందాలను చూస్తూ ఉండి పోయాను..నేను,

రచన:-✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments