పింగళి గారికి నివాళి -- డా వి.డి. రాజగోపాల్

పింగళి గారికి నివాళి -- డా వి.డి. రాజగోపాల్



పింగళి గారికి నివాళి

(పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా)


భారతావని గర్వించదగ్గ బిడ్డ 
ఈ ఆరడుగుల భారతీయుడు
తెలుగు గడ్డ ముద్దు బిడ్డ 
జాతీయ పతాకం రూపకర్త

మువ్వన్నెల జెండా
మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా
అది రెప రెపలాడితే
ఆగాలి పీల్చిన ప్రతి పౌరుని 
రక్తంలో నింపుతుంది దేశ భక్తి
దేశ రక్షణకై నిరంతరం
పోరు సల్పే మన సైన్యానికి
ఈ జెండా పౌరుషం నింపే
ఓ బెలూన్

ఆకు పచ్చ పచ్చని పైర్లకు
కాషాయం త్యాగానికి
తెలుపు స్వచ్ఛతకు
అందు అశోకచక్రం ధర్మనిరతికి
ఓ నిలువెత్తు నిదర్శనం

ఈ రంగుల  ఎన్నిక
ఈ జెండా రూపకల్పన
ఎంత అద్భుతం
మీ దేశభక్తికి ఏమివ్వగలం
మనస్ఫూర్తిగా నివాళులు తప్ప
జోహార్లు మీకు మీ జయంతి నాడు

-- డా వి.డి. రాజగోపాల్

0/Post a Comment/Comments