భావి పౌరులు.. బాలల గేయం సత్య మొం డ్రెటి

భావి పౌరులు.. బాలల గేయం సత్య మొం డ్రెటి


భావి పౌరులు

చిన్ని చిన్ని అడుగులు వేసి
బాలలు రారండి భావి పౌరులు రారండి
మీచిన్నారి అడుగులేసి బాలలు రారండి 
భావి పౌరులు రారండి
చిన్ని చిట్టి చేతులతో పలక బలపం తీయండి
మీచిన్నారి చేతులతో ఆ ఆ ఇ ఈ రాయండి....
నీ చిన్నారి నీ నోరు తెరిచి తెలుగు పలకండి... 
తెలుగు భాష నేర్వండి.......
ఆ  మొదలుకుని క్ష వరకు
మన అక్షరాలు ఏబై ఆరు..
అ అంటే అమ్మ...
అమ్మ లాంటిదే మన భాష
అక్షరమాల నేర్చుకుని... 
జ్ఞాన మూర్తులు కావాలి....
మన జాతికి పేరు తేవాలి
చిన్ని చిట్టి అడుగు లేచి బాలలు రారండి...
భావి పౌరులు రారండి
మీ చిన్నారి అడుగులేసి
బాలలు రారండి
భావి పౌరులు రారండి.
విశ్వమంతా తిరిగి మీరు
వీరులు కావాలి
వీరమాతను కొలవాలి
మీ చిన్నారి భావాల దివ్వెలు వెలగాలి...
తెలుగు దివ్వెలు వెలగాలి
అజ్ఞానపు తిమిరాన్ని పారద్రోలాలి
విజ్ఞానపు వెన్నెలని... ఆహ్వానించాలి... 
అది ఆయు కావాలి మీకు ఆయువు కావాలి
చిన్ని చిన్ని అడుగులు వేసి బాలలు రారండి..
మీ చిన్నా నీ అడుగు లేచి బాలలు రా రండి 
భావి పౌరులు రారండి బాలలు రారండి భావి పౌరులు రారండి....

--- శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్
చరవాణి: 9 4 9 0 2 3 9 5 8 1

0/Post a Comment/Comments