పసి పండితుడు --- సత్య మొం డ్రెటి

పసి పండితుడు --- సత్య మొం డ్రెటి



పసి పండితుడు

పసిడి పలుకులు పసివాడా
వాగ్దేవి వరపుత్రుడా
పుస్తకమే నీ ఆయుధం
ప్రపంచానికి వేదం
జన్మించావు పోతన వారసుడిగా
తరతరాల కవుల జ్ఞాన గంధాన్ని రంగరించి
లిఖి స్తున్నావు భారతాన్ని... 
నీ భారతంలో లేవు ఆకలి కేకలు
జాతికి పట్టిన చీడలు
అంధకార అంగవైకల్యాలు..
అందమైన నీ బాల్యం
అందరికీ ఆరాధ్యం..
పసితనపు ఆటపాటలు మాని  
పుస్తకమే ప్రపంచమని ఋజువు చేస్తున్నావు...
నిలువు నామం తో శ్రీ మహావిష్ణువు అంశతో
వచ్చావు భువికి.
మహా పండితుడిని ఆశీర్వదించే అర్హత లేదు 
ప్రాయంలో పెద్దగా మహా కవి
గా సత్ కవిత్వానికి తేజముగా
వెలగాలి నీవు నీ పేరు శతకోటి వసంతాలు 
చిరస్థాయిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను.....


--- శ్రీమతి సత్య మొం డ్రెటి 
హైదరాబాద్

0/Post a Comment/Comments