"పుష్కర స్నానం" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"పుష్కర స్నానం" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

పుష్కర స్నానం

మకరరాశిలో గురుడు ప్రవేశించగా
తుంగభద్రా నదీమతల్లికి నమస్కరించి
భక్తులు పవిత్ర స్నానమాచరించి
భక్తిశ్రద్దలతో పూజలునిర్వహించి
సంతోషంతో పునీతులయ్యారు
పర్వతశిఖరాలు నదీపరీవాహకప్రాంతాలు
ప్రకృతికి ఆనవాళ్లుగా నిలిచాయి
తరతరాలుగా పూజలుపునస్కారాలు
పుష్కరస్నానాలు మన
సంస్కృతికి దర్పణాలు
రెండు ప్రత్యేక నదులకలయికతో
తుంగభద్రానదికన్నడనాడులో పుట్టి
ఆంధ్ర తెలంగాణప్రాంతాలలో
పరవళ్ళుతొక్కి కృష్ణానదిలో సంగమించింది
విజయనగరసామ్రాజ్యం ఈతీరాన
స్థాపించబడడం చారిత్రికసత్యం
౧౨సంవత్సరాలకొకసారి ౧౨రోజులపాటు
పుష్కరస్నానాలు జరగడం ఆనవాయితీ
కరోనా కష్టకాలంలో పుష్కరస్నానాలు
ఆచరించి తెలుగుసంస్కృతికి
ప్రతిబింబంగా నిలవడం విశేషం


ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments