నూతన పద్యప్రక్రియ పద్యచంద్రిక రూపొందించిన రచయిత్రి ధనాశి ఉషారాణి
ఆంద్రప్రదేశ్ చిత్తూరుజిల్లా భాకరాపేటకు చెందిన ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు రచయిత్రి ధనాశి ఉషారాణి అనేక సాహితీ ప్రక్రియలు రూపొందించారు వానిలో రాగగీతి రాగఘరి పద్య ప్రక్రియలు సోయగము సిరిమంజరి వంటి వచన ప్రక్రియలు ఉన్నాయి.వేటికి అవే నూతనముగా సాగుతూ కవుల మన్ననలను పొందాయి. అనేక శతకాలు కవులు రాయడము జరిగింది.అనేక బిరుదులను కవులు పొందారు ప్రక్రియలకు వన్నె తెచ్చేలా రాయడము జరిగింది.ఇప్పుడు పద్యచంద్రికను రూపొందించారు
పద్యచంద్రిక లక్షణాలు
- ఇది పద్యప్రక్రియ ఇందులో 4 పాదాలు ఉండును.
- ప్రతి పాదములో 6 గణాలు ఉంటాయి.
- ప్రతి పాదములో మూడవ గణము యొక్క మొదటి అక్షరముకు యతిస్థానము కలదు.
- నాలుగు పాదాల్లో ప్రాసనియమoను గలదుప్రతి పాదములో 1 3 5 స్థానాల్లో మూడు మాత్రలను కలిగి ఉండును.
- 2 4 6 గణములులో ఆరు మాత్రలు వచ్చేలా రాయాలి.
"పద్యచంద్రిక పద్యము"
పసిడి నవ్వులుతో పరవశమొనరించి నన్ను మురిపించుము
కసిగ మాటలతో కంట తడినేపెట్టినా శుభముకాదు
వసియె వాడిపోవు వసుధ లోనప్రగతి నిజముతెలుసుకోను
మసియె బారిపోక మలుచు యువతబతుకు ఇలన గురువుగాను
శుభము లనివ్వగా సోమ శేఖరహర నతులు గొనరండూ
యభయ మందించర నాది శంకరభువి యనఘ భవానీశ
విభవ సారహరే విరుల పూజ లందు శివా నమామ్యహమ్
శుభము గూర్చుమురా శూలి పరమేశ్వర జనుల కీవెప్పుడూ
"పద్యచంద్రిక"
రూపకర్త: ధనాశి ఉషారాణి,
చిత్తూరు జిల్లా,
భాకరాపేట.