బంధాలలో గందరగోళం----వడ్డేపల్లి మల్లేశము

బంధాలలో గందరగోళం----వడ్డేపల్లి మల్లేశము


బంధాలలో గందరగోళం
----వడ్డేపల్లి మల్లేశము9014206412

 అనాదిగా స్త్రీని బానిసగా చూస్తున్నాడన్న మగవాడి పై ఆరోపణ అటుంచితే
 నేటి ఆధునిక కాలంలో
 కుటుంబ బంధాలలో గందరగోళానికి
 బాధ్యత  శ్రీ అన్నది నగ్నసత్యం.
 సామాజిక బాధ్యత సవ్యంగా మోయాలంటే
 కుటుంబ ప్రశాంతత ముఖ్యమే కదా!
 నేటి సీరియళ్లలో బాధ్యులు ఎవరో ఎందుకు చేస్తున్నారో తేలిపోతున్నది కదా!
 బంధాలకు గండి కొట్టి, కుట్రలకు జీవంపోసి
 వర్గాలను సృష్టించి, ఘర్షణలకు దారి తీసేది
 స్త్రీ కి స్త్రీ ఏ శత్రువ న్నమాట
 రుజువు చేస్తున్నది కదా!
 రెండు కుటుంబాలకు వారధి అయిన స్త్రీ
 భిన్నంగా వ్యవహరించడంలో అర్థముందా?
అలకలు, ఆవేశాలు, నిందలు, నిలదీత
 స్త్రీ సొంతమైతే బంధాలలో బలమెక్క డిది?
 సామాజికతకు స్థానం ఎక్కడిది?
 పురుషుల అసంబద్ధత  లేదని కాదు
 ఆత్మీయత అనురాగం తో అలరించే బదులు
 ఘర్షణ వైరుధ్యాలకు కారణమవుతున్న
 కుటుంబ చిత్రానికి బాధ్యులెవరు?
 ఇరువురు ఆలోచించవలసిన దే!
 పిల్లలపై, సమాజంపై ప్రభావం పడకుండా
 సంసారాన్ని చక్కబెట్టుకో వలసిందే.
 సంసార నావను నడిపించాలంటే
 సమన్వయం, సమయస్ఫూర్తి ఇరువురికి అవసరమే*
 మనుగడ కోసం, వ్యవస్థ కోసం పోరాటం చేయాలి కానీ,
 పరస్పర పోరాటం మనుగడకు
 సామాజిక ఎదుగుదలకు చాలా నష్టం!
 తీక్షణంగా పరిశీలించండి
 ఆత్మావలోకనం చేసుకోండి
 ఎవరు బాధ్యులు అవుతున్నారో
 తప్పులు తెలుసుకొని సవరించండి
 కుటుంబ బంధాల బలోపేతానికి,
 సమాజ మనుగడకు తోడ్పడండి.


0/Post a Comment/Comments