దవ్యౌషధము మునగ
ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని
ప్రసాదించే పోషకము మునగ
చిక్కిశల్యమైన శరీరానికి
మెరుగులు దిద్దు సుగంధము..!
పాలిచ్చేతల్లులకు, పాలుతాగే పిల్లలకు
సంపూర్ణ ఆయుష్షును ఇచ్చే ఆరోగ్యప్రదాయిని..!
మహిళల సమస్యలకు తారకమంత్రమై
బతుకు నావను దరికిచేర్చే వరప్రదాయిని
రోగాలను తగ్గించే దివ్య అస్త్రములే
మునగమొక్క లోని ప్రతి భాగము..!
కుళ్లిపోయిన మేనుకు కొత్త నెత్తురును
సమకూర్చే అపర సంజీవని మునగాకు..!
సౌందర్య సాధనాలలో లేపనమై
సుగంధ ద్రవ్యాలలోఅలరారు పోషక వనరు ..!
మనిషి చేయని మేలు మునగాకు చేయునన్నట్లు..
మనిషి దేహానికి సురక్షిత దివ్య ఔషధము
మునగ అమృతములను వాడి చిరంజీవులై వర్ధిల్లండి..!
-- పిల్లి హజరత్తయ్య