సీస పద్య శోభితుడు ---సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.

సీస పద్య శోభితుడు ---సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.

'సీస పద్య శోభితుడు!'
(వచన కవిత)

ఆంధ్రుల ఔన్నత్య సంశోధితుడు..
రాయలసీమాంధ్ర సాంస్కృతిక హొయలు తెలిపిన తెలుగు సాహిత్య సర్వజ్ఞుడు..
యవ్వన ప్రాయంలోనే
బృహత్కావ్యాన్ని రచించిన
వేదాంగ పారంగతుడు..
సీస, పద్య, గద్య, కావ్యాలతో
పాఠకులచే 
సాహితీ జైత్రయాత్ర చేయించిన
పోతన సన్నిహితుడు..
దివ్య ప్రబంధ శైలికి ఆదరణ కల్పించిన ప్రజ్వల ఉజ్వల కవిశ్రేష్ఠుడు..
సాహితీ సంద్రంలో 
నిత్య సరిగంగ స్నానమాడుతూ..
ఛందస్సు టూగుటుయ్యాలలూగుతూ..
చాటువుల ఛలోక్తులు విసురుతూ..విలాసవంత విగ్రహ సౌందర్యోపాసకుడు..
కవిత్రయం సరసన వాగ్వివాద సరస సంభాషణ  చేస్తూ..
పాండిత్య, ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన అద్వితీయ అసమాన్య షోడశ గ్రంథ మహాకవి 
సాక్ష్యాత్తూ శంకరుడినే మెప్పించిన జన్మ చరితార్థ ఘనుడు..
శ్రీనాధ కవిసార్వభౌమ బిరుదాంకితుడు..
సీస పద్య శోభితుడు..!!

--సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.

0/Post a Comment/Comments