'సద్గురువు నీవే!'----సుజాత పి.వి.ఎల్,

'సద్గురువు నీవే!'----సుజాత పి.వి.ఎల్,


'సద్గురువు నీవే!'

తల్లి, తండ్రి, గురువు, దైవం
సర్వం నీవే..
సర్వాంతర్యామి నీవే
మనసారా నిను స్మరించిన వారిపై
ప్రేమానురాగాలు కురిపించేది నీవే
ఆపదలందు ఆర్తిగా
"సాయీ"! అని పిలిచిన వారిని
అక్కున చేర్చుకుని ఆదుకునే
ఆపద్భాందవుడవు నీవే..
గురు సేవలోనో సర్వాన్నీ చూపిన
జగద్గురువు నీవే..
యోగులకు యోగివి నీవే
మహా ఙ్ఞానివి నీవే
నీ పలుకూ ఙ్ఞానమే!
నీ మౌనమూ ఙ్ఞానమే!!
ప్రకృతిలోని అనేక రూపాలనుండి
ఙ్ఞాన మధువును సేకరించి బోధించిన
గురువు నీవే.. మాలోని అఙ్ఞానాన్ని
హరింపజేసి... ఙ్ఞాన వైరాగ్యములను
కరతలామలకం చేసి జన్మరాహిత్యం వైపు
దృష్టి మరలించి సన్మార్గంలో నడిపే
సద్గురువు నీవే!!
గురు పౌర్ణమి  విశిష్టతను గుర్తు చేసే
ఆదర్శమైన గురువు నీవే.

     -----సుజాత పి.వి.ఎల్,

సైనిక్ పురి, సికిందరాబాద్.




0/Post a Comment/Comments