"బాల గేయం"
నింగిలోని చుక్కలు కోసుకొద్దామా
నేలపై మొక్కలుగా నాటుకుందామా
హరివిల్లునే మనం మోసుకొద్దామా
అందులో రంగులను రాసుకుందామా!
ఆరుబయట ఆటలు ఆడుకుందామా
పిల్లగాలూలను ఆనందంగా వీక్షిద్దామా!
మనమంతా హరివిల్లును చుట్టివద్దామా
గగనాన్న తారాలతో మురిసివద్దామా!
చెట్టాపట్టాలేసుకుని ఊరంతా తిరిగివద్దామా
ఆడిపాడి సంబరాలతో సందడిచేద్దామా!
బాజాభజంత్రాలతో ఊరంతా మ్రోగిద్దామా
అంబరానంటే పండగసంబరాలు చేద్దామా.!
రంగురంగుల పూలు కోసుకొద్దామా
అంగరంగవైభవంతో పూజలుచేద్దామా!
నింగిలోని ఇంద్ర ధనస్సునే తలపిద్దామా.
అవనిలోని అందాలను ఆశ్వాధిద్దామా!
ఛలోఛలోమంటూ బడికి పోదామా
గురువులకు దణ్ణం పెడదామా
చదువులు చక్కగా చదివేద్దామా
అమ్మ నాన్నల మెప్పు పొందేద్దామా!
వి . కృష్ణవేణి
వాడపాలెం.
తూర్పుగోదావరి జిల్లా.
ప్రక్రియ :గేయం