జడి వాన -ఇడుకుల్ల గాయత్రి

జడి వాన -ఇడుకుల్ల గాయత్రి

జడివాన

నేను అక్షరాల  మబ్బులను 
గుండెలలో దాచుకున్నాను
 అవి కారుమబ్బులు ఆలోచన దారుల వెంట 
జడివాన కురిపిస్తున్నాయి
ఒళ్లంతా దుఃఖం కప్పుకున్న నా కన్నీళ్ళని 
వాన చినుకుల ప్రవాహంలో నింపుకొని వెళ్ళిపోతున్నాయి
జ్వలించే ప్రేమరాగాలు మత్తు బురద చీల్చుతూ 
సుదూర తీరాలకు సాగిపోతున్నాయి
తీయని అనురాగ హాలాహలం తనువంతా చేరకుండా 
ఉరుములు చదర కొడుతున్నాయి
కఠినమైన స్వరం ఏదో వినిపించేలా 
మేఘ గర్జనలు సత్యలోకానికి స్వాగతిస్తున్నాయి
ఆ పిల్ల కాలువలు ప్రేమ వాస్తవాలని వేరు చేస్తున్నాయి
ప్రేమ శత్రువుల కాగితపు పడవల లో దుఃఖాలను నింపుకొని 
ఇంద్రధనస్సు వర్ణాలలో ఆశల తుంపరలు జల్లి సాగిపోతున్నాయి 
వెలసిన జడివానలో అలసిన కనులకు 
జీవిత వాస్తవాలు పెనవేసుకున్నాయి
పిడుగు పడిన గుండెలోని నిప్పులాంటి నిజాలను మోస్తూ 
జడివానలు ఎదురీదేగా ఆశ వాడల వెంట గొడుగు భూని
అడుగులు వేస్తున్న


మీ
ఇడుకుల్ల గాయత్రి 

0/Post a Comment/Comments