నిర్లక్ష్యం -జీవిత అంధకారమయం.

నిర్లక్ష్యం -జీవిత అంధకారమయం.


నిర్లక్ష్యం -జీవిత అంధకారమయం.

 కుటుంబ నిర్లక్ష్యం అగును చిన్నాభినం
కుటుంబ వ్యవస్థ మొత్తంగా..
కట్టుబాట్లను నిర్లక్ష్యంచేస్తే అడగంటిపోవును సంస్కృతీసాంప్రదాయాలు.
తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల భవిష్యత్ నిస్ప్రయోజనం..
గురువు నిర్లక్ష్యం విద్యార్థికి భవిష్యత్  మార్గం అస్తవ్యస్తమే.. 
ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం 
ప్రజల జీవితకాలంఅంతా నిర్వీర్యం..
వైద్యుని నిర్లక్యం రోగి ప్రాణాలు బలి..
విద్యార్థులు చదువులపై నిర్లక్ష్యం
వారి జీవితాలు అంధకారమయం...
రహదారుల నిర్లక్యం
ప్రజలప్రాణాలు తో చెలగాటం...
దేశ పౌరుని నిర్లక్ష్యం
 దేశ రక్షణ మాటుమయం...
వెనుకబడును  కార్మికుల జీవితాలు
యంత్రాంగం నిర్లక్ష్యంతో...
కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే
 జీవితకాలం వృధా...
అభివృద్ధిలేక జీవితమంతా వ్యధే..
పెట్టుబడిదారుల నిర్లక్ష్యం
 శ్రామికుల బ్రతుకులు అంధకారమయం..
ప్రతీ నిర్లక్ష్యం వెనుక ఏదోఒక నిస్ప్ర యోజనం తప్పదు..
కాలమే దానికి సరైన  సమాధానం.. 

వి. కృష్ణవేణి
వాడపాలెం

 

 

0/Post a Comment/Comments