త్యాగమూర్తి "నాన్న" -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు.

త్యాగమూర్తి "నాన్న" -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు.

      త్యాగమూర్తి "నాన్న"
---------------------

వెలుగులీను దీపము
ప్రేమకు ప్రతిరూపము
ఎవరు వర్ణించలేరు
నాన్న గొప్ప త్యాగము

నాన్న మహా భాగ్యము
ఇంట స్వర్గతుల్యము
తరిగిపోని మోదము
శ్రావ్యమైన నాదము

నాన్న మనసు శ్రేష్ఠము
అందరికీ ఇష్టము
క్షణము దూరమైనా
విలవిలలాడు డెందము

నాన్న విలువ ఎరుగుము
వారి బాట సాగుము
కన్పించే దైవము
కలకాలం కొలువుము

--గద్వాల సోమన్న, 
గణితోపాధ్యాయుడు,
       ఎమ్మిగనూరు. 

0/Post a Comment/Comments