అభినేత్రి - మన సావిత్రి
నిశ్శoకర సావిత్రి సుప్రసిద్ధ సినీనటి
కాదు మహానటి, నడిగర్ తిలగంగా
ఖ్యాతి గడించిన మేరునటి
నటనలోనూ నాట్యంలోనూ
రూపంలోనూ గుణంలోనూ
పలుకులోను ప్రవర్తనలోను
వలపు వయ్యారాలలోను
దానధర్మాలలోను
సాటిలేరు సావిత్రికెవ్వరు
సావిత్రిగారి నటనావైదుష్యం
ఆమె కీర్తిపతాకంలో మణిమకుటం
వైవిధ్యమయ పాత్రలకు
ప్రాణప్రతిష్ట చేసిన అభినేత్రి
పేదలపాలిట కల్పతరువు
సాటి, తోటి నటులతో
గౌరవాభిమానాలతో మెలగడం
సరిలేరు సావిత్రికెవ్వరు
నేల మరుగునగల నిక్షేపం
ఫలము మరుగునగల రుచి
శిలలమరుగునగల హేమం
తరుల మరుగునగల తేజం
భావము మరుగునగల బ్రహ్మమై
తెలుగింట వెలసిన పవిత్రకుసుమం
స్నేహశీలి, నిగర్వి, నిస్వార్థి
గుండు మల్లెలంటే ఇష్టం
బంగారం అంటే మహా ఇష్టం
చిరు నవ్వు చిద్విలాసం
ఆమె జీవితం నిరుపమానం
చిత్రసీమలో ఉరుములా ఉరిమి
మెరుపులా మెరిసి
వర్షపుధారలా కన్నీటిధారను
తెలుగు హృదయాలలో నింపి
స్వర్గసీమ చేరుకుంది
ఆమెకు అనంతకోటి జోహార్లు
ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు