ఓసీ ! కరోనా రాక్షసీ ! ఎంత పని చేశావే?... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఓసీ ! కరోనా రాక్షసీ ! ఎంత పని చేశావే?... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఓసీ ! కరోనా రాక్షసీ !
ఎంత పని చేశావే?

విశిష్ట అతిథిలా 
అమాయకంగా వస్తావ్
విషపు నవ్వునవ్వుతావ్
ఆకలి ఆకలి అంటావ్
అర్థాంతరంగా అకస్మాత్తుగా 
కోట్లు కోట్లున్న కోటీశ్వరులనేమి
కూటికిలేని కడునిరుపేదలనేమి
రాత్రికి రాత్రే మాయం చేస్తావ్
నిర్దాక్షిణ్యంగా కాటికీడుస్తావ్

మా ఆశలను సమాధిచేస్తావ్
మా కలలు కాల్చి బూడిదచేస్తావ్
మా రక్తసంబంధాలను రద్దుచేస్తావ్

ఓసీ ! కరోనా రాక్షసీ !
ఎంతటి దయలేనిదానవే !
చూడు అటుచూడు
తమకు అంత్యక్రియలు 
జరగనందుకు ఐనవారికి
కడచూపైనా దక్కనందుకు
కాటిలో శవాలు సైతం 
కన్నీరు కారుస్తున్నాయి

ఓసీ ! కరోనా రాక్షసీ !
ఎంత పని చేశావో !
చూడు అటుచూడు
తీరని ధనదాహంతో 
కొందరు నరరూపరాక్షసులు
చీకటి వ్యాపారాలు చేస్తూ
ధర్మాసు ఆసుపత్రులను 
స్మశానాలుగా మారుస్తున్నారు

ఓసీ కరుణలేని కరోనా రాక్షసి !
ఓసీ మాయదారి మహమ్మారి !
మళ్ళీ మూడవ అవతారమా?  
విశ్వంలో విహారయాత్రా ?
మానవాళిపై దండయాత్రా ?
తప్పదు ఈసారి నీకు శవయాత్ర

ఔను కరోనా మూడవ అవతారమంటే 
ముమ్మాటికది మృత్యువు అవతారమే
వికృత చేష్టలతో విలయతాండవమే
అందుకే ముందుజాగ్రత్తలు తీసుకుందాం!
భౌతిక దూరాన్ని పాటిద్దాం ! 
మందికి దూరంగా వుందాం ! 
ముఖానికి మాస్క్ లు ధరిద్దాం ! 
చేతులు శుభ్రంగా కడుక్కుందాం !
తక్షణమే వ్యాక్సిన్ వేసుకుందాం !
కరోనా ముప్పును తప్పించుకుందాం !
మిత్రులారా! జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త !

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502


0/Post a Comment/Comments