అంతర్జాల నరకం

అంతర్జాల నరకం


అంతర్జాల నరకం

ఏం చెప్పాలి రా ?
ఏం చేయాలి రా ?
నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా కొడుకు రాకేష్ ఈమధ్య చాలా మారిపోయాడు.  ఏం చేస్తే మారుతాడు కూడా అర్థం కావడం లేదు .ఇంటర్నెట్ ,ఇంటర్నెట్ వెబ్ సైట్ లను ఆటలు ఆడుతూ జూదం మొదలుపెట్టాడు. అంతేకాదు యూట్యూబ్ లో  తప్పుడు వీడియోలు చూస్తున్నాడు, ఒక్కటేమిటి అనేక వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. వీటిని ఎలా దారిలో పెట్టాలి ,అర్థం కావడం లేదు. అంటూ బోరున విలపించారు రాజశేఖరం.

పక్కనే ఉన్న స్నేహితుడు రమేష్ ఊరుకో రా ,ఇవాళ రేపు పిల్లలు అందరూ అలానే అయిపోయారు .నూటిలో 50 శాతం పిల్లలు ఇలానే అయిపోయారు. ఇది సామాజిక మాధ్యమాల వల్ల జరుగుతున్న అనర్థం. ప్రతి సినిమాలోనూ, అంతర్జాలం లోనూ ప్రేమ ప్రణయాల ను చూపిస్తున్న కోణం. దీనివలన చాలా మంది పిల్లలు చెడు మార్గాన్ని  నిర్దేశిస్తున్నాయి .

మనము పవిత్రత బతకాలి అనుకుంటే, ఎలా బతుకుతుంది రా. యువతకి నేడు లక్ష్యం ఉండడం లేదు. ఎప్పుడైతే వాళ్ళు లక్ష్యం వైపు అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తారు, అప్పుడే వాళ్లకి ఆత్మ నిగ్రహం కలుగుతుంది. అందుకనే మన వేదాలు మన శాస్త్రాలు చిన్ననాటినుంచి వాళ్ళకి అలవాటు చేయాలి .అలా చేయడం వల్ల దానిలో ఉండే పవన శక్తి వారిని చెడు వైపు ఆకర్షించే నీయదు .    యుక్త వయసులో అంతర్జాలం ఉపయోగించడం వల్ల, వారి మనస్సు చంచలం అయిపోతుంది .ఈరోజు మనం మన పిల్లలకి  ఏమి చేయమని  చెబుతున్నాము ,వాడు మొహం కడుక్కోకుండా కాఫీ తాగుతారు. స్నానం చేయకుండానే టిఫిన్ చేస్తారు .ఒక్కసారి స్నానం కూడా కొన్ని రోజుల దాకా చేయరు. ఏం నేర్పుతున్న మనం ,గారాబంగా పెంచి అడిగిందల్లా ఇచ్చి ,వారికి సగం జీవితం యొక్క విలువ తెలియకుండా చేస్తున్నాం ,మన చిన్నప్పుడు చూడు  ఖచ్చితంగా మన నానమ్మలు తాతయ్యలు ,స్నానం చేసి పూజ చేసుకుంటే, పెట్టేవాళ్ళు తిండి.  పొద్దున్నే లేపి వాళ్లు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని మనకు అలవాటు చేశారు, కానీ మనం ఏం చేస్తున్నాం 9 అయినా వాళ్లని నిద్రలేపము, సమయపాలన లేకపోయినా పట్టించుకోము. వారు చేసే ప్రతి పని తేలికగా తీసుకుంటాము. మరి తప్పు ఎవరిది రా? దారి తప్పించిన మనదా లేక తప్పిన వాళ్లదా?

పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు .మనం చెప్తే నేర్చుకుంటారు. కానీ మనం  చెప్పము ,బయట నుంచి చిరాకుగా వచ్చి ,ఆ కోపం అంతా వాళ్ళ పైన చూపిస్తూ ఉంటాము .

మన జీవిత  అంతా మనం వాళ్ల కోసం సంపాదిస్తూ ఉంటాం. కానీ వాళ్ల   జీవితానికి కావలసిన
ది క్రమశిక్షణ ,అది నేర్పించడం మాత్రం మర్చిపోతాం. మరి ఎలా మారతారా?

ఇప్పుడు రాజశేఖర్ ,"అవునురా నిజమే ,ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఒక మహా పోరాటం చేయాల, ఏమో అనిపిస్తుంది,మా కొడుకు నేను మార్చుకోవడానికి. ఇది నాకు ఇప్పుడు కత్తి అంచున నడవడంలా తోస్తుంది. ప్రతిక్షణం నాకు యుగంలా గడిచిపోతుంది. ఎలా వాడిలో మార్పు వారికి నాంది వేయాలో? నువ్వే ఏదో సలహా చెప్పురా...?

సరేరా నేను చెప్పిన సలహాలు పాటించు .వాడిలో మార్పు రావచ్చేమో? నువ్వు కూడా వాడి వయసు కు మారిపో. వాడితో సరదాగా గడుపు. వాడికి ఎక్కువ అంతర్జాలంలో గడిపే అవకాశం లేకుండా చేయి, వాడు  పాఠాలు లు వినే సమయంలో నువ్వు కానీ ,మా చెల్లి కానీ మీ పనులు పక్కన పెట్టుకుని లేదా పనిచేసుకుంటూ వాడితో కూర్చుండి. పిల్లల మనస్సు చాలా సున్నితమైనది. నువ్వు చెల్లాయి వాడి ముందు గొడవ పడకండి. మీరిద్దరూ ఒకరితో ఒకరు గౌరవంగా మెలగండి ,ప్రేమగా కూడా మెలగండి .అప్పుడు వాడు చూసే దృష్టి నెమ్మదిగా మారుతుంది .మీకు వీలైనప్పుడు బయటికి వాడిని తీసుకువెళ్లి, సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కండి .వాడి ముందు మంచి విషయాలు మాట్లాడండి. అందులో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయండి. ఇలా చిన్నచిన్న మార్పులు చేస్తూ ప్రయత్నం చేయండి .కొంచెం తేడా వస్తుందేమో? అంతేకాకుండా వాడి లో మార్పు  మొదలైన తరువాత, ఒక ఆట ఆడుతున్న భావన కలిగించి ,నెమ్మదిగా ధ్యానం అలవాటు చేయండి .ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసి ప్రయత్నం చేయరా ..కౌన్సెలింగ్ అవసరం లేదు రా.

నువ్వే ఒక కౌన్సిలర్ ఇప్పుడు వాడికి .జరిగి పోయిన నష్టాన్ని ఎలాగూ సరి చేయలేవు .ఇక ముందు నష్టం జరగకుండా జాగురూకతతో ఉండు. పాత సినిమాల్లో కూడా చాలా కామెడీ ఉన్నాయి కదా ,అలాంటి సినిమాలు పెట్టుకొని అందరూ సరదాగా నవ్వుతూ ఉండండి. ఈ కాలంలో కూడా కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి, కుటుంబంతో కలిసి చూడగలిగేవి అందులో వాడికి నచ్చిన హీరో సినిమాల్లో మంచిని ఎంచుకుని, ఆ హీరో క్యారెక్టర్ లోని సద్గుణాలు వాడి ముందు పదే పదే అంటూ ఉండండి, అలా చిన్న చిన్న మార్పులు జీవనశైలిలో చేసుకుంటూ ప్రయత్నం చేయరా.

చాలా గొప్పది అయిన సలహాలు చెప్పావురా... అదే ప్రయత్నంలో ఉంటాను... ఇప్పటిదాకా అల్లుకొన్న దిగులు పోయి నీ మాటలతో ధైర్యం వచ్చింది రా. నమ్మకం కూడా వచ్చింది రా ..తప్పకుండా ప్రయత్నం చేస్తాను రిషి ,
వెళ్లి వస్తాను రా ...

సరే సెలవు, మరి అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నాను...

నేటి జీవన విధానంలో అంతర్జాలం అనేది ఒక భాగమైపోయింది .దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకునే పిల్లల జీవితాలు చాలా ఉత్తమంగా ఉంటున్నాయి .కొంతమంది పిల్లల జీవితాలు మాత్రము పక్కదారి పట్టి ,తప్పుడు ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ ,నిజమైన పురోగతిని సాధించలేక పోతున్నాయి.

ప్రతి తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా, సమాజం పట్ల వారి యొక్క దృష్టికోణాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. చిన్నతనం నుండే మంచి ఆదర్శాన్ని వారికి ఏర్పరచాలి .వారి యొక్క బుద్ధివికాసానికి అనువైన వాతావరణాన్ని కనిపించాలి .సమాజానికి ఉత్తమ పౌరులను అందించగల గాలి .అప్పుడే వారి కుటుంబం తద్వారా సమాజం ఉత్తమ మైనటువంటి శిఖరాలని అధిరోహించగలుగుతాయి .అందరూ దీనిని గ్రహించి, సమాజ మార్పు కి మీ వంతు సహకారం ఇస్తాము అని నాకు మాట ఇవ్వండి.


మీ
ఇడుకుల్ల గాయత్రి



0/Post a Comment/Comments