ప్రకృతి సిరి --- పిల్లి. హజరత్తయ్య, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా

ప్రకృతి సిరి --- పిల్లి. హజరత్తయ్య, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా


ప్రకృతి సిరి

తనువు చీల్చి పెంచిన ప్రాణాలు
ప్రాణవాయువు అందక విలవిలలాడుతూ
ప్రాణాలు గాల్లో కలుస్తుంటే
మొక్కలు మౌనంగా రోదిస్తున్నాయి..!

అభివృద్ధి పేరుతో అడవులు నరికి 
ఆకాశహర్మ్యాలు కోసం తరువులను చంపి
కాలుష్య పిశాచి కోరల్లో నలుగుతున్న
ప్రజల దుస్థితికి తల్లడిల్లుతున్నాయి..!

మానవాళి జీవితంలో వెలుగులు పెంచి
పరోపకారమే పరమావధిగా భావించే
వృక్ష సంపదను కాటికి పంపి
కరోనా రక్కసికి చిక్కి రోదిస్తుంటే
వృక్షజాతి విలపిస్తున్నది..!

మనిషి దురాశకు బానిసయై
తన గొయ్యిను తానే తవ్వుకుని
తిరిగిరాని లోకాలకు వెళుతుంటే
చెట్లు దీనంగా చూస్తున్నాయి..!

నిస్వార్థ జీవులైన వృక్షాలను
మానవుల కల్పతరువులైన పచ్చదనాన్ని
ప్రాణవాయువు ప్రదాతలను కాపాడుంటే
ఈ ఘోరకలిని ఆపేదానినని వాపోతున్నాయి..!

ఇకనైనా మొక్కలను విరివిగా నాటి
అడవులను బాగా పెంచి
ప్రకృతిసిరి బలాన్ని వృద్ధిచేస్తే
శత్రువులైన వైరస్ లను తుదముట్టించి
భవిష్యత్తు తరాలను కాపాడే అవకాశాన్ని
ఇవ్వమని చేతులెత్తి ప్రార్ధస్తున్నాయి..!

ఇది నా సొంత రచన అనువాదం కానీ అనుకరణ కానీ కాదు

--- పిల్లి. హజరత్తయ్య
శింగరాయకొండ
ప్రకాశం జిల్లా

0/Post a Comment/Comments