కలల కడలి
మధురోహల మది నిశీధి నిదురలో నా కనుల కడలిలో
అలల కలలు....
దరి చేరని అలలు కొన్ని
దరిచేరిన రసమయ కలలు కొన్ని
ఆ అలల కలలు చరిత్రను చుట్టి వచ్చాయి రారాజుల రాజ్యాలను కనులకు కట్టాయి
ఎందరెందరో మహా సామ్రాజ్య నేతలను కనులారా గాంచి తిని నా జన్మ తరించింది....... కలలోనైనా మీ వైభవాన్ని చూసినందుకు....
దేశభాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు తనానికి ప్రతీక అయిన శ్రీ కృష్ణదేవరాయ మహారాజ్ నన్ను దీవించారు....
బంగారు తివాచీ పరచి నన్ను ఆహ్వానించారు..,. ఎందరో కవులకు దక్కని దండ పెండేరాన్ని బహుమతి గా ధరింప చేసారు.... వాహ్....ఏమీ నా వైభవం......
కనులు తెరిచిన నేను కలగంటిని అని తెలిసి మగతగా మరి నిద్రపోయా
నా కనుల కడలిలో కడలిలో ఎగిసిపడే స్వాతంత్ర సమర కెరటాలు కదలి వస్తున్నాయి
ప్రతీ అల లో స్వాతంత్ర సమర వీరులు .... త్యాగమూర్తులు....
స్వతంత్ర భారతంలో సుఖీభవ అంటూ ఆశీర్వదిస్తున్నారు....
మహానుభావులారా కలలోనైనా నాకు కనిపించారు మీ స్ఫూర్తిని వినిపించారు.... నా జన్మ ధన్యమైంది అంటూ పుణ్యమూర్తుల పాదాలకు ప్రణామములు అర్పించాను.....
కొమ్మ మీద కోకిలమ్మ గానంతో కళ్ళు తెరిచి చూసాను..... అందమైన స్వప్నం..... మరువలేని మరిచిపోని స్వప్నం
స్వప్నము కూడా మధురమే కదా.... మంచి స్వప్నం వరమే కదా.... స్వప్నంలో కూడా నవరసాలు అగుపిస్తాయి....... కలల కావ్యాన్ని రాసే అవకాశం ఇచ్చిన రస స్రవంతి సాహిత్య కవులకు అక్షర నీరాజనాలు
పేరు: శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్
చరవాణి :9 4 9 0 2 3 9 5 8 1