పాతవి మరువాలే! పేరు: సి. శేఖర్(సియస్సార్)

పాతవి మరువాలే! పేరు: సి. శేఖర్(సియస్సార్)

పాతవి మరువాలే!

ఎలచ్చన్లొస్తే సాలు
మూలకు కూసవెట్టిన ముసలోళ్ళ నుంచి
కొనాటి కొమ్మనకూసున్న పోరగాళ్ళందరూ
నాయకుల దిమాకుల మెదుల్తరు
ఏసీ గదులల్ల సల్లగుండెటోళ్ళు
కార్లల్లకెల్లించి అడుగు కిందవెట్టనోళ్ళు
పెజాసామ్యంలా ఎన్నికల యుద్ధంలో
అతికారం కోసం అందరూ
ఎన్నికలస్తే అచ్చిరాంగనే
కడుపులకెల్లొస్తవో
గొంతుల్నుంచొస్తవో 
గామాటలన్నీ చెవుల్వోతవి
ఎలచ్చన్లొస్తే వోనకుర్సినట్లు
ఎల్వనే ఎల్వవు
ఇరుగమరుగ వోన దంచికొట్టినట్లు జనాలు తడిసి ముద్దయిపోతరు
మంత్రివర్గమంతా గూసొని
ఆగమేఘాలమీద గపగప్పటికే
గరంగరంగా నిర్ణయాలన్ని తీసుకుంటరు
దళిత బందంట కొత్త వరం
మూడెకరాలేమో పాతమాటిపుడు మర్సిపోవాలే

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.


0/Post a Comment/Comments