తెలుగుతల్లి-అనురాగవల్లి-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు

తెలుగుతల్లి-అనురాగవల్లి-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు

తెలుగుతల్లి-అనురాగవల్లి
----------------------------------
గొప్పది తెలుగు తల్లి
అందరికి సిరిమల్లి
కోరినవి ఇచ్చేటి
భువిలో కల్పవల్లి

అదిగో తెలుగుతోట
ఇదిగో వెలుగు బాట
పదవోయ్ తెలుగోడా!
వినవోయ్ ఘన రేడా!

అందాల జాబిల్లి
నింగిని పాలవెల్లి
అందరూ మెచ్చేటి
బంగరు తెలుగుతల్లి

కొలువురా! మదిలో
కృషి చేయి మహిలో
సతతంబు కొనియాడు
తెలుగులో మాట్లాడు

గళమెత్తి నిందించు
శివమెత్తి నర్తించు
తెలుగుతల్లి ఖ్యాతిని
జగమంతా చాటించు

--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు

0/Post a Comment/Comments