మన్యం వీరుడు అల్లూరి __డా విడి రాజగోపాల్

మన్యం వీరుడు అల్లూరి __డా విడి రాజగోపాల్



మన్యం వీరుడు అల్లూరి

(అల్లూరి వారి జయంతి సందర్భంగా)

విప్లవం ఊపిరై దేశభక్తి ఉప్పెనై పొంగంగా
మన్యంలో తిరుగుబాటు చేసి
బ్రిటీష్ దొరలను  గడగడలాడించి
స్వరాజ్యం కోసం పోరాడిన ధీరుడు అల్లూరి

సమస్యలతో పోరాడటం వీరినైజం 
గిరిజనులపైన జరిగే అకృత్యాలు
మనసును కలిచివేసింది
బాధిత గిరిజనులకు భరోస ఇచ్చారు
గిరిజన గుండెల్లో గూడై నిలచాడు
కేవలం విల్లంబు ఆయుధంగా 
పోలీసు స్టేషన్పై చెప్పి  దాడి చేసిన సాహసి

బ్రిటీష్ వారు లూథర్ ఫర్డ్ ద్వారా
తనను పట్టుకోనెంచి
మన్యం ప్రజలను హింసించడం
ప్రజలు పడే హింసలకు చలించి
బ్రిటీష్ వారికి బంధీయై  
వందేమాతరం అంటూ 
తన రక్తం ప్రతి బొట్టు చేయాలి
మరో విప్లవ వీరుని  అంటూ నేలకొరిగాడు
భరత మాత వడి స్వాగతించింది 
ఇలాంటి విప్లవ వీరుల  త్యాగఫలమే
మన భారతావని సంకెళ్ళు తొలగి
మనం శ్వేచ్చా వాయువులు పీలుస్తున్నాం
వారి జయంతి సందర్భంగా  నివాళి 

__డా విడి రాజగోపాల్,
హైదరాబాద్,

0/Post a Comment/Comments