అపర చాణక్యుడు(ఇష్టపది) -డా. అడిగొప్పుల సదయ్య

అపర చాణక్యుడు(ఇష్టపది) -డా. అడిగొప్పుల సదయ్య


అపర చాణక్యుండు అర్థశాస్త్రజ్ఞుండు
మేరునగధీరుండు మితభాషి,శూరుండు

విశ్వనాథకు జ్ఞాన పీఠమేసినవాడు
రాజుగా,మంత్రిగా రాటుదేలినవాడు

పదునాల్గు భాషలను ప్రవచించగలవాడు
ఒక్కడై పనులన్ని చక్కబెట్టెడివాడు

పాలనా పగ్గముల పాటవముతోపట్టి
ప్రగతికై సరళంపు బాటవేసినవాడు

మృగరాజసపు ఠీవి మురిపించు మన పీ.వి.
దేశపాలనకద్దె తెలగాణ పూతావి

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
M.A.(Tel),M.A.(Eng),M.Sc(Math),B.Ed
జమ్మికుంట, కరీంనగర్
9963991125


0/Post a Comment/Comments