మా సమిష్టి కుటుంబం
------------------------------
కుటుంబం కుటుంబం కుటుంబం
కుల మత ప్రమేయం లేని కుటుంబం
గుణ గణం ప్రధానం గల కుటుంబం
వ్యస్టి కాని మా సమిష్టి కుటుంబం !
కుటుంబం కుటుంబం కుటుంబం
అందరినీ అలరిస్తూ మురిపిస్తూ
అనుబంధం సంబంధాల పెనవేస్తూ
ప్రబంధమై ప్రబలుతున్న కుటుంబం
కుటుంబం కుటుంబం కుటుంబం
మాది ఉమ్మడి గుమ్మడి కుటుంబం
పలువురు మెచ్చినచ్చిన కుటుంబం
కొలువై కోవెలగలిగినమాకుటుంబం
కుటుంబం కుటుంబం కుటుంబం
కలతలు లేని విలువల కుటుంబం
కలగలిసిన ఇల వెలసిన కుటుంబం
మమతల మల్లెలల్లిన కుటుంబం !
కుటుంబం కుటుంబం కుటుంబం
అందరం కుదురుకున్న కుటుంబం
ముందుకు సాగుతున్న కుటుంబం
ఎందుకైన మా సమిష్టి కుటుంబం!
కుటుంబం కుటుంబం కుటుంబం
ముద్దూ ముచ్చట్లమాఈ కుటుంబం
పెద్దల సుద్దుల ముద్దుల కుటుంబం
హద్దుల పద్దుల రద్దుల కుటుంబం !
కుటుంబం కుటుంబం కుటుంబం
కుట్రల కుబుసం వీడిన కుటుంబం
మానవత్వంపంచుకున్నకుటుంబం
దానవత్వం తెంచుకున్న కుటుంబం
కుటుంబం కుటుంబం కుటుంబం
ఆనందాల హరివిల్లుల కుటుంబం
మూడు పువ్వులు ఆరుకాయలుగ
నిత్య కళ్యాణం పచ్చతోరణముగ
విలసిల్లు ఈ విలాసాల కుటుంబం
భాసిల్లు కులాసాల మా కుటుంబం!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.