కీ.శేIIదాశరథి కృష్ణమాచార్యులు

కీ.శేIIదాశరథి కృష్ణమాచార్యులు

పేరు : యెనుగందుల శంకర్
ఊరు : నిజామాబాద్

తెలంగాణ గడ్డపై చిన్నగూడూరు లో
చిగురించిన కవి సింహమా !
నిను బోలిన రాజులేడని నూనూగు మీసాలపుడే
నిజాం పిశాచాన్నే నిలదీసిన నిలువుటద్దం నీవు

అగ్నిధారను సృష్టించి
రుద్రవీణ తో మదిలో వీణలు మ్రోగించి
ఆశలన్ని చెలరేగించి
పునర్నవం పుట్టించి

మహతీ సాహితీ కన్న తండ్రి
నా నిజామాబాదు చెరసాలలో
"నా తెలంగాణ కోటి రత్నాల వీణ "
అని అమృతాభిషేకం చేసిన
ఆంధ్ర ఆస్థాన కవి !

ఓ చైతన్య స్ఫూర్తి !!
మీర్జా గాలిబ్ గీతాలను మాకోసం రాసి
తిమిరంతో సమరమై, వీణా పాణిలు గా
పేరొందిన మహేంద్రో దయుడా !!

ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడ బాలనమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని
భాస్కరులెందరో..........

ఓ కళా ప్రపూర్ణ !!
ఓ బంగరు రంగుల చిలుకా అని,
అందాల ఓ చిలుకా అందుకో ఈ లేఖ అంటూనే
బాబు వినరా అన్నాదమ్ముల కథ ఒకటి కథ చెప్పావ్

ఓ డా II గారు
రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య
తెలంగాణ తేరా కృష్ణయ్య అన్న నీ
సంకల్ప బలం, అమోఘo, అసమానం, అనితర సాధ్యం మరెవ్వరికిని.........

యెనుగందుల శంకర్
M.Sc(Org.chem)
ఆరోగ్య విస్తరణ అధికారి నిజామాబాద్

మహాత్మా జ్యోతిభా ఫూలే జాతీయ అవార్డ్ గ్రహీత
పి.వి.నరసింహారావు స్మారక జాతీయ అవార్డ్ గ్రహీత
తెలంగాణ సాహిత్య రత్న అవార్డ్ గ్రహీత
మన తెలుగు తేజం జాతీయ పురస్కార గ్రహీత
కవితేజ జాతీయ పురస్కారం గ్రహీత   

0/Post a Comment/Comments