సింగిరెడ్డి సి. నా. రె. ....(డాll సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్బంగా )......

సింగిరెడ్డి సి. నా. రె. ....(డాll సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్బంగా )......

సింగిరెడ్డి సి నా రే
మట్టి మనిషి మల్లారెడ్డి
పుడమి తల్లి బుచ్చమ్మ
ల " లేత కిరణమా "

"నన్ను దోచుకున్నవటే వెన్నెల దొరసాని
యని సువిశాల సుశీల నుమనువాడి
"మనిషి గా జీవించాలని "తపనపడ్డ
"మధ్య తరగతి మందహాసమా

ఆకలి వాకిట కేకలు పెట్టిన
ఆరని బాధలు అంచులు ముట్టిన
జ్వాల శిశువు "దివ్వెల మువ్వల "
"నవ్వని పువ్వు "ఓ విశ్వంభరా !!

అగ్ని ని పుట్టించి అమృతం కురిపించిన
రెండంచుల పదునైన కత్తి,"కలం సాక్షిగా "
కలం అంచుమీద రెక్కల సంతకాలు చేసి
జ్వాలగా జీవించాలనుకున్న జ్ఞానపీఠ అవార్దీ

"తేనె పాటలు "రాసిన "ముత్యాల కోకిల "
"నా చూవు రేపటి వైపని "దూరాలను దూసుకొచ్చావ్
"సంప్రదాయరీతులoటు" "కవిత మీ చిరునామా "
"కలిసి నడిచే కాలం "ఓ కళాప్రపూర్ణ !!

"ప్రపంచపదుల"" విశ్వం లో ఉన్నప్పుడు "
"మావూరు మాట్లాడిందని మనిషి గా జీవించాలని
మంటల మానవుల కులమతాల ఉక్కు డెక్కల
నలిగిన "నడకే నా తల్లి" ఓ పద్మశ్రీ !!

కంటేనే అమ్మ అని అంటే ఎలాని
నంది ని నవ్వించి "ఇవి ఏ జీవ నదుల"
"జలపాతమో ""నింగికెగిరే చెట్లలో "
"వాక్కుకు వయసు లేదా "పద్మవిభూషణా !!

రాజ్యసభ రాజసంలో రాజువోలె
"కొనగోటి జీవితం"" మరో హరివిల్లు"ఐనా
" అజంతా సుందరి"" నీ రీతు చక్రం "
"మృత్యువు నుంచి" తప్పించుకోలేని
కవిరాజా !!

**యెనుగందుల శంకర్
M.Sc(Org.chem)
ఆరోగ్య విస్తరణ అధికారి
నిజామాబాద్
మహాత్మా జ్యోతిభా ఫూలే జాతీయ అవార్డ్ గ్రహీత
పి.వి.నరసింహారావు స్మారక జాతీయ అవార్డ్ గ్రహీత
తెలంగాణ సాహిత్య రత్న అవార్డ్ గ్రహీత
మన తెలుగు తేజం జాతీయ పురస్కార గ్రహీత
కవితేజ జాతీయ పురస్కారం గ్రహీత   

0/Post a Comment/Comments