మనుసులోమెదిలిన
సిన్ని ఆశ
నేనుండేదో గుడిసెలో
నిండిన చెరువు లో ఆటలు
పండిన పైరులో పాటలు
పారే నీటిలో అడుగులు
దోసిళ్లనీటితో సవ్వడులు
కడుపునిండా సద్ది బువ్వ
చేతినిండా కూలి పనులు
ఆవులు ఎనుములపేడ
ముద్దలతో పిడకలు చేసి
అమ్ముకునే జీవనం.
బుడ్డి దీపంలోసదివిన
సదువుమద్యలో ఆగిపోయినా
అచ్చిరాలు మర్సిపోలే
నా మనసులో....
గుండెలో ఇరబూసే
పూల వాసనని ఎదజల్లాలని
కంటి సూపులోని బాసని
అచ్చిరాలుగా రాయాలని
కోయిల లా పాడి
కొందరి గుండెల్లో
నా మాటా..... నా పాటా
ఓ... జోలపాట గా
నిల్సిపోవాల.....ని
సుగుణ మద్దిరెడ్డి 🌹
ఐలవారిపల్లె
ఐరాల.
🌷
సిన్ని ఆశ
నేనుండేదో గుడిసెలో
నిండిన చెరువు లో ఆటలు
పండిన పైరులో పాటలు
పారే నీటిలో అడుగులు
దోసిళ్లనీటితో సవ్వడులు
కడుపునిండా సద్ది బువ్వ
చేతినిండా కూలి పనులు
ఆవులు ఎనుములపేడ
ముద్దలతో పిడకలు చేసి
అమ్ముకునే జీవనం.
బుడ్డి దీపంలోసదివిన
సదువుమద్యలో ఆగిపోయినా
అచ్చిరాలు మర్సిపోలే
నా మనసులో....
గుండెలో ఇరబూసే
పూల వాసనని ఎదజల్లాలని
కంటి సూపులోని బాసని
అచ్చిరాలుగా రాయాలని
కోయిల లా పాడి
కొందరి గుండెల్లో
నా మాటా..... నా పాటా
ఓ... జోలపాట గా
నిల్సిపోవాల.....ని
సుగుణ మద్దిరెడ్డి 🌹
ఐలవారిపల్లె
ఐరాల.
🌷