అందరి బంధువు
రచన:డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
అమ్మగారికి దండం పెట్టు
అయ్యగారికి దండం పెట్టు
అంటూ చెప్పిన మాటలు విని
కాళ్ళెత్తి తల ఆడిస్తుంది.
అంతా శుభం జరగాలని దీవిస్తుంది.
వీపుపై బొంతలను కప్పుకొని
కొమ్ములను అందంగా అలంకరించుకొని
గలగలమంటూ సవ్వడి చేస్తుంది.
విన్యాసాలెన్నో అలవోకగా చేసేస్తూ
ఇల్లిల్లూ తిరుగుతూ
శుభ సంకేతం అవుతుంది.
తనను నమ్ముకున్న వారికి ఉపాధి కల్పిస్తూ,
ఊరంతటికి శుభాలను అందిస్తుంది.
దేవతా రూపమై పూజ్యనీయమవుతుంది.
పనెంతో చక్కగా చేసి
బాధ్యత తనదే నంటుంది.
రైతుకు నేస్తమై నడిచి,
పల్లెకు శాశ్వత బంధువవుతుంది.