వలపుగీతిక
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
తొలిచూపులతో కలయిక
ప్రేమను పుట్టించింది.
మనసులు కలిసిన వేళ
ప్రణయము మూడుముద్దులు
ఆరుకౌగిళ్ళుగా వర్థిల్లింది.
మధుర జ్ఞాపకాలతో రోజులు
వలపుగీతికలుగా సాగిపోగా,
పెళ్ళికి పెద్దల అంగీకారాలతో
సంతోషాలు వెల్లివిరిసాయి.
వేడుకలు,సరదాలతో,
తల్లిదండ్రుల,బ్రాహ్మణుల
బంధుమిత్రుల ఆశీర్వాదాలతో
నూతన జీవితం ప్రారంభమైంది.
సంసార బాధ్యతలు,సల్లాపాలతో
దాంపత్యం మురిసింది.
ఏ ప్రళయమూ వారిని
విడదీయరానంత ఎదిగి-ఒదిగి
ఆదర్శమైనారు.