బాలల ప్రపంచంlllడా.రామక కృష్ణమూర్తిlllబోయినపల్లి,మేడ్చల్.

బాలల ప్రపంచంlllడా.రామక కృష్ణమూర్తిlllబోయినపల్లి,మేడ్చల్.

బాలల ప్రపంచం
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.


పిల్లలు వారు పిల్లలు
ఆకాశమే హద్దుగా
ఆనందాలు తోడుగా
ఎగిరి గెంతులు వేస్తారు.
లోకమంతా మాదే అనుకొని
అడ్డులేకుండా విహరిస్తారు.
రంగుల ప్రపంచాన్ని
హరివిల్లుల్లాగా అలంకరిస్తారు.
ఆటలు,పాటలు,అల్లరితో
అనంతమైన జీవనాన్ని ఆస్వాదిస్తారు.
మల్లెలై,మొల్లలై,మలయానిలులై,మది నింపుతారు.
భావాల,అనురాగాల,
ఆత్మీయతల నిలువరాలై
నిలిచిపోతారు.
చిన్న,చిన్న ఆనందాలకే సంతృప్తులై,
ధరణిని ధన్యం చేస్తారు.
రేపటి ఆశల రూపాలై,
కర్మలకు సహచరులై,
నిష్కల్మష హృదయాలతో
నిండైన చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. 
బాలల ప్రపంచపు స్వర్గద్వారాల చెంతన నిలుచుంటే,
చింతలు మాయమై,
చిరాయుష్షువు పలకరిస్తుంది.


0/Post a Comment/Comments