చదువు విలువ lllసయ్యద్ జహీర్ అహ్మద్

చదువు విలువ lllసయ్యద్ జహీర్ అహ్మద్


చదువు విలువ

ఇంటికి వెలుగు చిమ్ముతూ
ఇల్లాలికి చేదోడు
పిల్లల చదువు నేర్చు తండ్రికి ప్రఖ్యాతులు!

ఎక్కడ నివసిస్తున్నామని ప్రశ్న కాదు
పేదరికపు దారుల్లో 
పూరిపాకలలో
గుండ్రటి గొట్టాలలో
చదువు విలువ విజ్ఞానం పెంచు
ఆశ తీరాలన్నా ఆశయాల సాధనకు
చదువే అసలైన మార్గం!

పిల్లల పెంపకంలో చదువుకు
తోడ్పడాలి పెద్దలు
మొక్కని వంగనిది మానై వంగునా యని
కూడబెట్టాలి విద్యాధనము
రేపటి పరిస్థితికి ఉజ్వల భవిష్యత్తుకు దిశానిర్దేశం! 

విద్య తమకు నాస్తి
తమ పిల్లల భవితకు ఆస్తి!
చదువుతో వుంది లోకజ్ఞానం!
       
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.


0/Post a Comment/Comments