వార్ధక్యం lllశ్రీమతి సత్య మొం డ్రెటి

వార్ధక్యం lllశ్రీమతి సత్య మొం డ్రెటి


వార్ధక్యమా నీకు వందనం
మానవ దశకు తుది వి నీవు
నిర్లక్ష్యానికి గురి వి నీవు
గత దశల ఔన్నత్యం మరుగు పడిన చీదరింపు చీత్కారాల వార్ధక్యమా...
ముదిమి తనపు తేనె లూరు
మమకారం చవి చూసిన వారు
ముసలి తనపు ముడుతలలో
దాగిన అనుభవాల అమృత
రసాన్ని ఆహ్వానిస్తారు...
వార్ధక్యం శాపం కాదు వరం
వృద్దులు మన జాతీయ సంపద..
రక్షించుకోవాలి మనం
గత చరిత్రకు నిదర్శనాలు
ప్రతి వ్యక్తి వృద్ధులను
ఆశ్రమము ల పాలు చేయొద్దు
రేపు మీకు అదే  పరిస్థితి
అవసాన దశలో ఆదరించి
అక్కున చేర్చుకోండి..
మానవత్వం తో మెలగండి
వృద్ధాప్యానికి శిరసు వంచి
నమస్కరించి  వారి దీవెనలు
పొందండి....

శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్
చరవాణి 9490239581

0/Post a Comment/Comments