కన్నీటి వ్యధలెన్నో..
పిల్లి.హజరత్తయ్య
ఊరు:శింగరాయకొండ, ప్రకాశం జిల్లా,9848606573
మానవ సంబంధాలు బలహీన పడుతున్న వేళ బంధుత్వాలు తెగిపోయి వేదనకు గురైన వారెందరో..
సులభంగా డబ్బు సంపాదించాలనే తాపత్రయంలో జీవితాన్ని నాశనం చేసుకుంటున్న అభాగ్యులెందరో..
సుఖంగా జీవించడానికి మోసాలకు పాల్పడుతూ తనను తాను మోసం చేసుకుంటున్నా అమాయకు లెందరో..
నాగరికత మోజులో సంస్కృతిని మరచి స్వార్థంతో బతుకీడుస్తున్న స్వార్ధపరులెందరో..
మానవుడు ప్రకృతిని కలుషితం చేసిన నేరానికి నేడు మూల్యం చెల్లిస్తున్న మనుషులెందరో..
రెక్కాడితే గాని డొక్కాడని జీవితాల్లో
కరోనా రక్కసి చిమ్ముతున్న విష జ్వాలలకు
ఆకలి కేకలతో అలమటిస్తున్న వలస జీవులెందరో..
కరోనా సృష్టిస్తున్న విలయ తాండవానికి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వారెందరో..
సమాజంలో జరుగుతున్న కన్నీటి వ్యధలకు భరతమాత కంట కన్నీరు ఇంకి పోయింది