పాదరస ప్రకంపనలు
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
ఒక్కసారిగా కలకలం
ఎక్కడి వారు అక్కడే పడిపోవడం.
కాళ్ళు చేతులు కొట్టుకుంటూ
కంపించిపోయారు.
ఆసుపత్రుల్లో జనం చేరికలు
ఏమి జరుగుతుందో తెలియని
గందరగోళస్థితి.
అనారోగ్య లక్షణాలు రకరకాలుగా
ఆందోళనలు కలిగించాయి.
మెదడు నరాలపై ప్రభావం
శరీరమంతా అయోమయం
కారణాలేమిటో తెలియక
అంతటా అస్తవ్యస్తం.
ఏమి తాగాలో,ఏమి తినాలో
తెలియని దుర్భరస్థితి.
నీటి నుంచి వచ్చిందా,తిండి నుండి వచ్చిందా తెలియని పరిస్థితి.
రసాయనాల ప్రభావమా?
గాలి ద్వారా సోకిందా?
తిండి ద్వారా చేరిందా?
తెలియని వింత పరిస్థితి.
వింతరోగమని నామకరణం.
భారలోహాల కలయికతో
రసాయనాల చేరికతో
భూగర్భజలాలు కలిసిపోయాయి.
పాదరసమే అధిక శాతం కలసిందని నిర్థారణ.
ప్రజలను బాధపెడుతున్నది.
కలికాలపు దౌర్భాగ్యాలకు
పాలకుల నిర్లక్ష్యానికి
పరిశ్రమల పాపాలకు
నిలువెత్తు సాక్ష్యమై ఘోషిస్తుంది.
(వచనకవిత)